Friday, October 3, 2014

మంత్ర నగరి సరిహద్దులను చెరిపేసే పనిలో ఉన్న ఇంకొకడు

నల్ల రేగడి 'నే'ల కంటి కాటుక దిద్దింది
నీరెండ పాదాల పసుపు పూసింది
మలిసంజె గన్నేరు సిగలోన రాలింది
జనుల కనులను తెరచి ఎల్లమ్మ నవ్వింది.
నవ్వితే నా తల్లి నందివర్ధనమే
శివమెత్తి ఆడితే నా తల్లి మహిష మర్ధనమే!
--------------యాగ్ని
(యాజ్ఞవల్క్య అనబడే ఒక ఇంకొకడు)

ఈ కవి ని ఎక్కడ పెట్టాలి ....యెవరి మధ్యలో?

ఇంకొకడు ...ప్రపంచమ్ నచ్చనివాడు......
పరిహసించేవాడు....
వెటకరించీ.....
వెక్కిరించీ.....
అలిసిపోయే వాడు
మాయ మాటల మూటల వెంటబడని వాడు
లేస్తూనే ఎవరన్న 'స్పందిన్చారా'? అనెడిగే పాపం పసివాడు
లేకపోతే కోపం గా  చూసేవాడు, మరు క్షణమే కోపాన్ని జాలి గా చూసేవాడు
మంత్ర నగరి సరిహద్దులను చెరిపేసే పనిలో ఉన్న ఇంకొకడు
ఇంకొకడు ...ప్రపంచమ్ నచ్చనివాడు......