Wednesday, October 14, 2015

సమయాలు....... సంధర్భాలు.......

నిన్న ...

కురిసీ కురియని మేఘం
పలికీ పలకని వాక్యం
కదిలీ కదలని కాలం
చర్వితచరణం.

నేడు............
అంతుచిక్కని అభిసారిక అంతరంగం
ఒక అందమైన అలలాంటి జ్ఞాపకం


రేపు ..........................

కలలా కదిలిపోతున్న కాలం
ఎన్నో మంచు బిందువుల పచ్చిక లోకి
నడిపిస్తున్న సూర్యోదయం .

Saturday, May 2, 2015

అకాల వర్షం

ఇప్పుడు
మంచు రాళ్ళు
మామిడి పిన్దెల్ని  ముద్దాడడం కావ్యం

ఇక్కడ
రోళ్ళు
నీళ్ళను  నింపు కోవడం రసాత్మకం

జీవితాన్ని పూరించడానికి
గుండ్రటి తాడు మాత్రమే
రైతుకు దొరకడం
అందమైన ముగింపు వాక్యం

వాక్యం రసాత్మకం కావ్యం



Wednesday, February 4, 2015

కల లోపలి కల

నుదిటి ఫై నా ముద్దు ను స్వీకరించు
నీ నుంచి వీడిపోయే వేళ..
'నీ తప్పులేవీ లేవని
నీ తో గడిపిన క్షణాలన్నీ కలల్లా గడిచాయని తలచనీ'

తీరం తాకేప్పటికే అన్నింటిని కల్పుకొని
అన్నింటిని మ్రింగేసి
పొరలు పొరలు గా నురుగును సైతం ఉప్పగా మార్చే అల
మనకు కనిపించే కరగని
కల లోపలి కల


సాగరతీరం లో నిలబడి
గుప్పిట్లోకి తీసుకున్న కాసిన్ని ఇసుక రేణువులు సైతం జారిపోతున్నాయి
జోరుగా వీస్తూ గాలి కూడా నా ఫై జాలిచూపడం  లేదు
సాగరతీరం ....
జారిపోతున్న ఇసుక రేణువులు......
జోరుగా వీస్తున్న గాలి
మనకు కనిపించే .... అనిపించే
ఒక కల లోపల కలా?

రేయి లో .....
దివం లో .......
దృశ్యం లో .......
శూన్యం లో .......
ఆశలావిరయితే మాత్రం ఏం ?
అన్నీ కోల్పోయామా మనం?
మనం కొల్పొయామనుకున్నదీ .....
కోల్పోయింది
కల లోపలి కల

(Inspired by Edgar alan poe's 'A dream within a dream')