Wednesday, February 4, 2015

కల లోపలి కల

నుదిటి ఫై నా ముద్దు ను స్వీకరించు
నీ నుంచి వీడిపోయే వేళ..
'నీ తప్పులేవీ లేవని
నీ తో గడిపిన క్షణాలన్నీ కలల్లా గడిచాయని తలచనీ'

తీరం తాకేప్పటికే అన్నింటిని కల్పుకొని
అన్నింటిని మ్రింగేసి
పొరలు పొరలు గా నురుగును సైతం ఉప్పగా మార్చే అల
మనకు కనిపించే కరగని
కల లోపలి కల


సాగరతీరం లో నిలబడి
గుప్పిట్లోకి తీసుకున్న కాసిన్ని ఇసుక రేణువులు సైతం జారిపోతున్నాయి
జోరుగా వీస్తూ గాలి కూడా నా ఫై జాలిచూపడం  లేదు
సాగరతీరం ....
జారిపోతున్న ఇసుక రేణువులు......
జోరుగా వీస్తున్న గాలి
మనకు కనిపించే .... అనిపించే
ఒక కల లోపల కలా?

రేయి లో .....
దివం లో .......
దృశ్యం లో .......
శూన్యం లో .......
ఆశలావిరయితే మాత్రం ఏం ?
అన్నీ కోల్పోయామా మనం?
మనం కొల్పొయామనుకున్నదీ .....
కోల్పోయింది
కల లోపలి కల

(Inspired by Edgar alan poe's 'A dream within a dream')