Monday, April 25, 2016

అశాశ్విత లోగొంతుకలు

అవసరమయినదంతా
అల్లుకుంటున్నప్పుడు .........
అల్లుకుంటున్న ప్రతీది
అవసరమయితున్నప్పుడు
అర్థాలు
అర్ధ నిమీలిత చిత్రాలు

క్షణాలన్నీ
అప్పటికప్పటి  డేరాలు !
మోహాలు
ద్వేషాలు
నిరసనలు
నిస్సహాయతలు
అశాశ్విత లోగొంతుకలు