Wednesday, November 14, 2012

ఒక స్వప్నం


కొంత దూరం ప్రయాణించాక
కొన్ని మజిలీలు దాటాక
కొన్ని ప్రశ్నల, సమాధానాల తరువాత
ఒక నిశ్యబ్ధం ఆవహిస్తుంది
పలుకుల రాతలసారమంతా దగ్ధమౌతున్న సందర్భం లా వెన్నాడి వేధిస్తుంది
ఐనా ఒక ఆశ... ఒక 'చెలి'మ ఊరిస్తుంది...........

Friday, November 9, 2012

రాయని ప్రతి వాక్యం రాసినట్లు
పలకని ప్రతి పదం గుసగుసలాడినట్లు
పలువరించని ప్రతి రేయీ తడిసినట్లు
తడిమిచూపిన వింత లోయ... లోక మాయ
ఒక సాలీడు ప్రపంచం!
అనుభూతుల అంతః చేతనల మధ్య 
నలుగుతున్న ఒక వేషం........సశేషం

వారధి


ప్రస్తుతానికీ ప్రస్తుతానికీ మధ్య
నీకు నాకు మధ్య
 ప్రపంచమొక వారధి

ఆ వారధి  ఫై ప్రయాణం
ఒక వ్రుత్హాంతం లోకి...
నీలోకి...ప్రపంచం లోకి ప్రవేశం

ఇరు తీరాల మధ్య
ఒక దేహం వొళ్ళు  విరుచుకుంటుంది
ఆ ఇంద్రధనస్సు వొంపులో నేను నిదురిస్తాను!!!

( An attempt to translate Octavia Paz's THE BRIDGE)

కవిత్వం


సరిగ్గా ఆ సమయం లోనే కవిత్వం విచ్చేసింది
నాకోసం వెతుకుతూ .....
ఏటినుంచో...వీచే గాలినుంచో .....
ఎందుకో తెలీదు...ఎప్పుడో తెలీదు....
అప్పుడు పదాలు లేవు...నిశ్యబ్దం లేదు...శబ్దాలూ లేవు
ఒక రాత్రి ఒంటరిగా నడుస్తున్న నన్ను
దావానలంలా చుట్టుముట్టింది!
తుళ్ళిపోతూ అ ఝాము నేనూ స్వరం కలిపాను
ఓ ఉన్మాదస్థితి లో!!
నిప్పును విప్పుతూ .........
జ్ఞాపకాల్ని కప్పుతూ ....
అజ్ఞాతంలోంచి గొంతు కలిపాను!
ఒక వెర్రివాడిలా నవ్వుతూ...
వెంటాడుతున్న దేహచ్చాయను స్మరిస్తూ
కాలాతీతం గా స్పృశిస్తూ ......ప్రపంచాన్ని ముడివేసాను!
ఒక రహస్యాన్ని చేదించబోయి
అనంతమైన రహస్యంలో కలిసిపోయాను......
చుక్కలతో చూపులు కలుపుతూ.....
నలుదిక్కులా  చిక్కుకుంటూ......
అరకన్నులతో..పొడినవ్వులతో
గాలిలో నడుస్తూపోతున్నాను...........
(Inspired by pablo neruda's poetry. pls Bear typo errors)