Friday, November 15, 2013

పిల్లలు

అన్ని కష్టాలు, నష్టాలు, అప్పులు, తిప్పలు దూరమయిపోవు
ఆ పసి మనసుల అమాయకపు నవ్వుల ఊయలలో ....
అన్ని అబద్దపు కేకలు ఆవిరయిపోవు
ఆ వింత ప్రశ్నార్తుల జోల లో ......

మానవాళికన్తా అలాంటి అవకాశం లేని ఈ క్రూర నిశి కేళి లో
ఆ వ్యక్థావ్యక్థ వ్యాకరణాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్ ......
మన తోకలను తగిలించవద్దు .....
మనలానే ఆలోచించమని శాశించవద్దు
మంచి చెడులు మాత్రం చెబుదాం ....

క్రూరత్వపు మరకలు ఆ దేహాల ఫై వేయకండి
ప్రపంచం ఫై మీ కక్షనంతా, ప్రతాపాన్నంతా ఆ చిరు దివ్వెల ఫై చూపొద్దు
ఆ లేత ముని వేళ్ల స్పర్శను అమృతం లా స్వీకరించండి ప్లీజ్ ........
అన్ని పసి హృదయాలను మనుషులుగా ఎదగనివ్వండి ప్లీజ్ .....

ఎందుకంటె
పొడుస్తున పొద్దులు
విరుస్తున్న నవ్వులు
పురివిప్పే మయురాలు
మన మర జీవితపు మనిషితనానికి నిదర్శనాలు

Monday, June 17, 2013

స్మృతి సంధ్య

ఈ గోధూళి వేళ ను కూడా
మనం పోగొట్టుకున్నాం
నీలపు రాత్రి
ఈ లోకం మీదికి రాలిపడుతున్నప్పుడు
మనిద్దరం చేయి చేయీ కలిపి
ఈ సాయంత్రం నడచిపోవడం ఎవరూ చూడలేదు.
కిటికీ లోంచి
దూరంగా పర్వత శిఖరాల పైన
ఆస్తమ సూర్యుడి  అరుణారుణ  రాతోస్తవం చూసాను.
కొన్నిసార్లు
ఆకాశం లో ఒక సూర్య శకలం
నా అరచేతిలోని రాగి నాణెం లా
కణ కణ మండడమూ చూసాను.
నేనేమి పోగొట్టుకున్నానో
నీకు బాగా తెలుసు
అందుకే
ఆ దుఖం లో
ఉద్విగ్న హృదయం తో
నిన్ను గుర్తుచేసుకున్నాను
(A free translation of Pablo Neruda's 'clenched soul' in Telugu) 


Friday, April 12, 2013

మంచు బిందువుల జంట


మంచు బిందువుల  జంట ఒకటి
నా వైపు చూసి నవ్విపొయిన్దీవేళ!
ఏమయి పోయాం  మనం ......

చీకట్లో శోకిస్తున్న సంద్రపు  తీరమూ...... కెరటం లా
ఏకాంత వనవసపు చిరునామాల్లా 'మసలు'తున్నాం మనం వేర్వేరుగా!

ఎన్నో కంచల్ని సుతారం గా కప్పుకున్న మౌనం
మౌనమూ భాష గా వెలసిల్లె వనవాసపు ద్వారం !

మనం...
   ఒకరంటే ఒకరికి తెలిసిన దూరం
    ప్రపంచానికొక పరిహాసం!

మనకు మాత్రం
విడి విడి గా వేసారుతున్న  ...మంచుబిందువుల్లాంటి జంట మనం ...

Friday, February 1, 2013

Pibare raama rasam............rasane.............


ఈ రోజు రాత్రికి
    రొజువారీ నిరాశలన్నీ మూటగట్టి
ఓ చిటారు కొమ్మ అంచున దాచిపెట్టాలి!

48 గంటల తర్వాత తొలిఝాము  అనివార్యం గా
ఆ అవమానాల, అనుమానాల మూట నెత్తుకొని మెల్లగా దిగి.............
సామానులన్నీ సరిచూసుకొని ...
మోసుకొని మళ్లీ బయలుదేరాలి!

కాని తొలిఝాము లేవడానికి, కిందికి తేవడానికి, మళ్లీ మోయడానికి
దైర్యం కావాలే?

ఆ దైర్యం ఈ 48 గంటల్లో సమకూర్చుకోవాలి!
అర్థం చేసుకూరూ..............................

అవును అర్థం కాలేదు ఎలా?

అయితే అర్థం చేసుకో  ఇలా................

ఎంత ఎంజాయ్ చేస్తాం?
 పని కూడా చేయాలి కదా?
కనీసం రోజులో 10 గంటలు పని చెయ్యకుండా ఎమ్చేయ్యగలం?
ఏం చెయ్యకుండా ఏమయినా ఎందుకొస్తుంది?
వీకెండ్ ల లైఫ్ ఉంటే డిసిప్లిన్ ఉండదు.............

సదరు జ్ఞానం ఆర్జించాలి.............గ్రహించాలి.............పంచాలి.............పెంచాలి..........

ఎందుకంటే.................
48 గంటల తరువాత పాంచాలి జీవితం మళ్లీ మొదలుపెట్టాలి
రొమాంటిక్ గా రోదిస్తూ.........
అనివార్యం గా సహిస్తూ.......
క్షణాలను లెక్కిస్తూ............

ఈ రోజు రాత్రికి
    రొజువారీ నిరాశలన్నీ మూటగట్టి
ఓ చిటారు కొమ్మ అంచున దాచిపెట్టాలి!