Monday, June 17, 2013

స్మృతి సంధ్య

ఈ గోధూళి వేళ ను కూడా
మనం పోగొట్టుకున్నాం
నీలపు రాత్రి
ఈ లోకం మీదికి రాలిపడుతున్నప్పుడు
మనిద్దరం చేయి చేయీ కలిపి
ఈ సాయంత్రం నడచిపోవడం ఎవరూ చూడలేదు.
కిటికీ లోంచి
దూరంగా పర్వత శిఖరాల పైన
ఆస్తమ సూర్యుడి  అరుణారుణ  రాతోస్తవం చూసాను.
కొన్నిసార్లు
ఆకాశం లో ఒక సూర్య శకలం
నా అరచేతిలోని రాగి నాణెం లా
కణ కణ మండడమూ చూసాను.
నేనేమి పోగొట్టుకున్నానో
నీకు బాగా తెలుసు
అందుకే
ఆ దుఖం లో
ఉద్విగ్న హృదయం తో
నిన్ను గుర్తుచేసుకున్నాను
(A free translation of Pablo Neruda's 'clenched soul' in Telugu) 


No comments:

Post a Comment